- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడి నుంచే పోటీ.. హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా అన్నారు. అయితే శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా డీహెచ్ నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలతో మమేకం అవుతున్నారు.
Next Story






