కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాలి : కూనంనేని

by Bhoopathi Nagaiah |

కమ్యూనిస్టులు ప్రశ్నించేందుకు అసెంబ్లీలో ఉండాలని.. కానీ తనకు ఒక్కడికే అవకాశం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.

కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాలి : కూనంనేని
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టులు ప్రశ్నించేందుకు అసెంబ్లీలో ఉండాలని.. కానీ తనకు ఒక్కడికే అవకాశం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని నమ్మదగ్గ హామీలు ఇచ్చిందని, కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల లింకును తాము బయటపెట్టి, ఓడించాలనుకున్నామని తెలిపారు. అందుకే చివరి నిమిషంలో కాంగ్రెస్‌ ఒక్క సీటు ఇచ్చినా పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, న్యూడెమోక్రసీ, సీపీఎం, జన సమితి పార్టీలు మనస్ఫూర్తిగా తమకు పని చేశాయని తెలిపారు. ఈ గెలుపు ఒక్క సీపీఐది కాదని.. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరిదన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోరుకున్నారు కాబట్టే పదేళ్ల రాచరిక పాలనకు చరమగీతం పాడారని తెలిపారు.

Next Story