శోకసంద్రంలో కమ్యూనిస్టులు.. సీనియర్‌ నేత దొడ్డ నారాయణరావు కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-12 07:12:52  IST  )

సీపీఐ (CPI) కురువృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణ రావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

శోకసంద్రంలో కమ్యూనిస్టులు.. సీనియర్‌ నేత దొడ్డ నారాయణరావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్/చిలుకూరు: సీపీఐ (CPI) కురువృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డ నారాయణ రావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నారాయణ రావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ సీనియర్‌ నేతలు నారాయణ (Narayana)తో పాటు పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ (Telangana) సాయుధ పోరాటానికి దన్నుగా నిలిచి.. నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచే వరకు నిలబడిన మహోన్నత వ్యక్తి దొడ్డ నారాయణరావు అని కొనియాడారు. సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన 1940వ దశకంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నారాయణరావు అన్న దొడ్డా నర్సయ్య అమ్రాబాద్ అడవుల్లో దళ ఉప కమాండర్‌గా పోరాటం సాగించారు. ఆయన బాటలోనే నారాయణరావు కూడా ఉద్యమ బాటలో నడిచారు. అనంతరం ఆయన 25 ఏళ్ల పాటు చిలుకూరు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించారు. అనంతరం మండల మొదటి ఎంపీపీగా ఎంపికై వరుసగా పదేళ్లు పని చేశారు. నారాయణ రావు అంత్యక్రియలను శనివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టు 20న ఆయన సతీమణి సక్కుబాయి (85) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

Next Story