- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూడాల్సిందే.. రావి నారాయణరెడ్డి ఓల్డ్ వీడియో వైరల్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి గురించి అందరికీ తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి (Ravi Narayana Reddy) గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరిక పాలనకు చరమగీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి. అయితే, (September 17) సెప్టెంబర్ 17 సందర్భంగా ఆయన మాట్లాడిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఒక చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది ప్రతి తెలంగాణ బిడ్డ ఈ వీడియో చూడాల్సిందేనని, వీడియో ఎండింగ్ అస్సలు మిస్ కావొద్దని ఓ యూజర్ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో రావి నారాయణ రెడ్డి మాట్లాడిన ప్రకారం.. ‘నిజాం, రాజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ముందుకు వెళ్లాం. అయితే ఇలా సాధ్యం కాదని, ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాం. సాయుధంగానే ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకునే ఆయుధాలను సేకరించడం ప్రారంభించాం. 1948 పోలీస్ యాక్షన్ జరిగే వరకు సాయుధ పోరాటం జరిగింది. పోలీస్ యాక్షన్ జరిగినా జరగకపోయినా నిజాం, రజాకార్లు బలహీనపడ్డారు. ప్రజల బలం మరింతగా పెరిగిపోయింది. ఆ సమయంలో ఎక్కడా కూడా వారి ప్రతిఘటన జరగలేదు. అప్పుడే పోలీస్ యాక్షన్ జరిగింది. పోలీస్ యాక్షన్ లేకున్నా నిజాంను ఖతం చేసేవాళ్లం’ అని వెల్లడించారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలన అంతమైంది. ఆపరేషన్ పోలోలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం లొంగిపోయారు. తర్వాత హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత నిజాం అలీఖాన్‌కు రాజప్రముఖ్ హోదా కల్పించారు. అయితే ఆపరేషన్ పోలో తో నిజాం, రజాకార్లు లొంగిపోవడం కంటే .. ఆపరేషన్‌కు ముందే సాయుధ పోరాట యోధుల దాడులతో వారు బలహీన పడ్డారని, పోలీస్ యాక్షన్ లేకపోయిన నిజాంను తాము ఖతం చేసే వాళ్లమని రావి నారాయణ రెడ్డి చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని పంపకపోతే, మన తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఖచ్చితంగా నిజాం, ఖాసిం రిజ్వీని చార్మినార్‌కు లాక్కెళ్లి ఉరితీసి ఉండేవారు.. అని ఎక్స్ యూజర్ @UttamKBRS ట్వీట్ చేశారు. వీడియో లింక్..






