తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ

by Gantepaka Srikanth |

కేంద్ర జలసంఘం చైర్మన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అయింది.

తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి కేంద్ర జల సంఘం(Central Water Commission) కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం చైర్మన్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ సభ్యులుగా రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో పాటు కమిటీలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు అధికారుల చొప్పున కమిటీలో చోటు కల్పించింది.

కాగా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.

Next Story