- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills By-Election: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ పకడ్బందీ ప్లాన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ద్వారా ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఈ కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు నివేదికను పూర్తిచేసి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా రాంచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. త్వరలోనే అధికారికంగా బీజేపీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. హైకమాండ్స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమీకృత ప్రక్రియ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడంపై దృష్టి పెట్టింది.
ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు ఐదుగురు పేర్లను నివేదికలో ఇచ్చినట్లు సమాచారం. ఈ కమిటీ ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంది. దీంతో పాటు గ్రౌండ్‌లో బలాబలాలను అంచనా వేసింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఐదుగురి పేర్లను సూచిస్తూ నివేదిక అందించింది. కమిటీ సూచించిన వారిలో గతంలో పోటీ చేసి ఓటమి పాలైన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరి కీర్తి రెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, ఆకుల విజయ ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై హైకమాండ్ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. అనంతరం జాతీయ నాయకత్వానికి పేర్లు పంపుతారు. ఆ తర్వాత అభ్యర్థి పేరు ఫైనల్ చేసే అవకాశం ఉంది.






