ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై కమిటీ

by Muthe.Rajitha |

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్‌ కోదండరాం, కంచ ఐలయ్యతోపాటు ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌తో పాటు ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా నియమించారు.

3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యేక ట్రస్ట్‌ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించి, పాలసీపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. అయితే గత నెల 28న తేదీనే ఈ జీవో ఇవ్వగా.. తాజాగా ఆ జీవోను విడుదల చేసింది.

Next Story