బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్స్ ఇచ్చిన కమిటీ

by Muthe.Rajitha |

బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో (Gandhi Bhavan) సమావేశం అయింది.

బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్స్ ఇచ్చిన కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపుపై న్యాయ సలహా కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీ బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో (Gandhi Bhavan) సమావేశం అయింది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

కాగా బీసీ రిజర్వేషన్ల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ 3 ఆప్షన్స్ ఇచ్చింది. అందులో మొదటిది.. జీవో ఇచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం. రెండవది.. అసెంబ్లీలో 50 శాతం రిజర్వేషన్ల స్లాబ్ ను ఎత్తివేస్తూ తీర్మానం చేయడం. మూడవది.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడం.

బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా మందుకు వెళ్లాలనే విషయంలో ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్కలతో ఈ కమిటీని (Committee of Ministers) ఏర్పాటు చేసారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 26వ తేదినే కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈరోజు మరోసారి భేటీ అయ్యారు. కమిటీ ఇచ్చిన ఈ మూడు ఆప్షన్స్ ను ఈనెల 30న జరగబోయే కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అదేరోజు స్థానిక ఎన్నికలపై ప్రకటన వెలువడనుందని చర్చ నడుస్తోంది.

Next Story