TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు చేసింది.

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు చేసింది. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. నివేదికను అధ్యయనం చేసి సారాంశాన్ని ఈనెల 4న కేబినెట్‌కు సమర్పించనున్నారు. కాగా, శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి కాళేశ్వరం కమిషన్‌ నివేదికను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (kaleshwaram project)పై జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సంబంధిత నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు ఆయన అందజేశారు. శుక్రవారం ఆ నివేదిక సీఎంకు చేరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు భేటీ అయ్యారు.

Next Story