స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-08-23 17:29:04  IST  )

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీని వేసింది సర్కార్. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈనెల 26వ తేదీలోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 29న కేబినెట్ సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు నేడు జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పీఏసీ సమావేశంలో పాల్గొన్న వారంతా స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే మొగ్గు చూపడంతో.. ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story