- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: వృత్తి విద్య కాలేజీల్లో ఫీజుల నిర్థారణకు కమిటీ ఏర్పాటు
ఇంజినీరింగ్, వృత్తి విద్య కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు రివైజ్డ్ గైడ్ లైన్స్ కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇంజినీరింగ్ (Engineering Colleges), వృత్తి విద్య కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు రివైజ్డ్ గైడ్ లైన్స్ కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Higher Education Department) చైర్మన్ జి.బాలకృష్ణ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసే, ఎసీడీడీ కమిషన్, డైరెక్టర్ ఎన్.క్షితిజ, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, డీటీసీపీ డైరెక్టర్ ఎస్. దేవేందర్ రెడ్డి, టీజీసీహెచ్ఈ సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్ టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొ. కె. వెంకటేశ్వరరావు, ఓయూ డీన్ ప్రొ. ఎ. క్రిష్ణయ్య, తో పాటు కమిటీ చైర్మన్ కోరుకున్న విధంగా మరో ఇద్దరు విషయ నిపుణులతో కూడిన కమిటినీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించనుంది. కళాశాలలు పాటిస్తున్న ప్రమాణఆలు, సౌకర్యాలను పరిశిలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.






