- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Paidi Rakesh Reddy : అధికార పార్టీకి కమీషన్లు..మెగాకు కాంట్రాక్టులు : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ సంస్థ(Mega Engineering Company) అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతుందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy)ఆరోపించారు

దిశ, వెబ్ డెస్క్ : మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ సంస్థ(Mega Engineering Company) అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతుందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy)ఆరోపించారు. ఆ సంస్థ ఓనర్ కృష్ణారెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని, లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతు ప్రజా సంపదను దోచుకుంటున్న మెగా సంస్థను వెంటనే తెలంగాణలో బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సరైన సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించుతామన్నారు.
ఓ చానల్ తో మాట్లాడిన రాకేష్ రెడ్డి హైదరాబాద్ లో ఉండే మెగా కృష్ణారెడ్డితో దావోస్ లో రూ.15వేల కోట్ల ఎంవోయు కుదుర్చుకోవాల్సిన అవసరమేంటని.. అదే ఒప్పందం ఇక్కడే చేసుకోవచ్చు కదా అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. మోసపూరిత ఎంవోయుల వెనుక గుట్టును సరైన సమయంలో రట్టు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కంపనీ అవినీతిమయమైందని..తెలంగాణను దోచుకుంటుందని..బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేసి..ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక నాలుగు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.
కాగ్ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినట్లుగా మెగాపై ఆవినీతి ఆరోపణలున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 8శాతం కమీషన్లు ఉంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 14శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. ఢిల్లీకి పంపే సంచుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మెగా సంస్థతో స్విట్జర్లాండ్ ఎంవోయు కుదుర్చుకున్నారని, ఆ ఎంవోయు వెనుక అవినీతి సొమ్ము ఎక్కడ పోతుందన్నది ముందుముందు తేలుతుందన్నారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేస్తున్నారని రాకేష్ రెడ్డిఫైర్ అయ్యారు. తనపై పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. తాను బలపడితే వారిద్దరికీ నియోజకవర్గంలో రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోనే పోస్టర్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే తన సొంత నిధులతో ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. కేంద్రం ఇండ్లు ఇస్తున్నప్పుడు రాష్ట్రం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఆర్మూర్ నియోజకవర్గానికి సరిపడా ఇళ్లులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ ఆర్మూర్ కు ప్రభుత్వం ఇళ్లు కేటాయించకపోతే.. ఇక్కడి ప్రజలు కట్టే ట్యాక్స్ లను వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాము ఆర్మూర్ ను ప్రత్యేకంగా పాలించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ ప్రభుత్వ పథకాలను పార్టీ పథకాలుగా మారుస్తున్న ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.






