- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC : జీహెచ్ఎంసీ ప్రక్షాళనపై కమిషనర్ ఫోకస్ ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC)లో అవినీతి నియంత్రణ దిశగా కమిషనర్ ఇలంబర్తి(Commissioner Ilambarthi) ఫోకస్ పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC)లో అవినీతి నియంత్రణ దిశగా కమిషనర్ ఇలంబర్తి(Commissioner Ilambarthi) ఫోకస్ పెట్టారు. క్రమంగా జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చర్యలు అమలు చేయాలని భావిస్తున్న కమిషనర్ ఇలంబర్తి బదిలీల(Transfers)పై కసరత్తు చేస్తున్నారు. ముందుగా జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలంగా తిష్టవేసిన వారిని, అవినీతి అధికారులను గుర్తించి బదిలీ చేయాలని కమిషనర్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకునే అధికారులతో పాటు వివిధ నిర్మాణాల పర్మిషన్లు, సర్టిఫికెట్ల జారీ వంటి పనుల నిమిత్తం వచ్చే ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లతో సమావేశమైన కమిషనర్ ఇలంబర్తి వారి నుంచి అధికారులు తీసుకునే కమిషన్ల పై ఆరా తీశారు.
జీహెచ్ఎంసీలో పని చేస్తున్న ప్రతి కంప్యూటర్ ఆపరేటర్, ఇంజనీరింగ్ విభాగంలోని ప్రతి అధికారిని బదిలీ చేయాలని, వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి చీఫ్ ఇంజనీర్ల వరకు బదిలీ చేయాలని కమిషనర్ నిర్ణయించారు. ఒకే చోట 5 ఏళ్లకు మించి పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ లను కూడా మార్చాలని నిర్ణయించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి చేపట్టిన ప్రక్షాళన చర్యలతో అక్రమాలకు అలవాటు పడిన అధికారులు, సిబ్బందిలో బదిలీల భయం పట్టుకుంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, స్వీపింగ్, బర్త్ ఆండ్ డెత్ సర్టిఫికెట్ల విభాగాలలో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతాయని భావిస్తు్న్నారు.






