- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ స్టోర్స్‌లో ఈ-వేస్ట్ డ్రాప్ బాక్సులు.. QR కోడ్ ఆధారంగా సేవలు.. పరిశీలించిన కమిషనర్
హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్ ) సరైన నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఒక కీలక ముందడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్ ) సరైన నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఒక కీలక ముందడుగు వేసింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సరైన విధంగా నిర్వర్తించకపోతే, అవి మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతాయని గుర్తించింది. అందువల్ల భారత ప్రభుత్వం దీనిని ప్రత్యేక వ్యర్థాలుగా గుర్తించి, కేవలం అనుమతి పొందిన సంస్థల ద్వారానే నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగానే 2026 జనవరి నుంచి పౌరుల నుంచి ఈ-వేస్ట్ సేకరణ తో పాటు జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమాలకు కృషి చేస్తోంది. QR కోడ్ ఆధారంగా ఈ కొత్త వ్యవస్థ ద్వారా పౌరులకు మూడు ముఖ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
డ్రాప్-బాక్స్ సౌకర్యం..
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బిగ్ సీ, బీన్యూ, హ్యాప్పీ, లాట్, సంగీత, సెలెక్ట్, టచ్ వంటి రిటైల్ స్టోర్లలో 30 డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. QR కోడ్ ద్వారా సమీప డ్రాప్ పాయింట్ల వివరాలు తెలుసుకుని, తమ వద్ద ఉన్న అవసరంలేని ఈ-వేస్ట్‌ను అక్కడ జమ చేయవచ్చు. 21 ఏప్రిల్ 2026 నాటికి అన్ని స్టోర్లలో ఒకే విధమైన డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు.
డోర్-స్టెప్ పికప్ సేవ..
హైదరాబాద్‌లోని అనుమతిపొందిన e-Waste రీసైక్లింగ్ సంస్థలైన ఎర్త్ సెన్స్, రీసిట్రానిక్స్, ఫ్యూర్ ఎర్త్, జడ్ ఎన్విరో, గ్రీన్ ఎన్విరో సంస్థలతో జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ చేసుకుంది. పౌరులు QR కోడ్ ద్వారా ఇంటి వద్ద నుండే ఈ-వేస్ట్ అందజేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని జీహెచ్ఎంసీ కల్పించింది.
అవగాహన కార్యక్రమాలు..
ఈ-వేస్ట్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జీహెచ్ఎంసీ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. వివిధ వార్డుల్లో ఈ-వేస్ట్ ప్రభావం, సరైన నిర్వహణ పద్ధతులు, నష్టాలపై అవగాహన కల్పించింది. ఈ-వేస్ట్ ఎకో సిస్టమ్ కార్యక్రమాన్ని అమీర్ పేట్ లోని హ్యాప్పీ, బిగ్ సీ స్టోర్లలో ఎర్త్ సెన్స్ ప్రతినిధులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ డ్రాప్ బాక్సులను ప్రారంభించారు.






