- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం భార్యపై వ్యాఖ్యలు.. పవన్ ఖేరా కోసం పోలీసుల వేట
అస్సాం సీఎం భార్యపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఖేరాపై FIR నమోదైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్య రిణికి భుయాన్‍పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం అసెంబ్లీకి ఎన్నికల వేళ రిణికి భుయాన్‍కు మూడు పాస్ పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పవన్ ఖేరాపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో విచారించేందుకు పవన్ ఖేరా కోసం పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. మంగళవారం ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న పవన్ ఖేరా నివాసంలో అస్సాం పోలీసులు తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాల సమయంలో ఆయన ఇంటిలో లేరు.
హైదరాబాద్‍కు షిప్ట్?
అస్సాం పోలీసుల చర్యలతో సోమవారమే ఆయన గువాహటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‍కు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని పవన్ ఖేరా నివాసం వద్ద భారీగా తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ పవన్ ఖేరా గువాహటి నుంచి హైదరాబాద్ కు పారిపోయారని విమర్శించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. అయితే ఓ వైపు ఆయన కోసం అస్సాం పోలీసులు గాలిస్తున్న వేళ పవన్ ఖేరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణకు షిప్ట్ కావడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.






