- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన ఘనత భగవద్గీతకే దక్కింది.. నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు
by Ramesh Naini |
ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కిందని నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కిందని నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేష్ అన్నారు. సోమవారం త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో జరిగిన భగవద్గీత పారాయణానికి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక గ్రంథానికి జయంతి నిర్వహించటం కేవలం భగవద్గీతకే చెల్లిందని ఆయన అన్నారు. యావత్ మానవజాతి బాధల్ని పోగొట్టే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉందన్నారు. అందుకే భగవద్గీతకు మాత్రమే జయంతి చేయడం ఆచారంగా ఏర్పడిందన్నారు. భగవంతుడితో సమానంగా భగవద్గీత పూజను అందుకుంటుందని పేర్కొన్నారు. హిందువులందరూ గీతాసారాన్ని అనుసరించాలని ఉద్భోదించారు. అనంతరం చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
Next Story






