- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్చకు ఎక్కడికొస్తారో రండి… టీ బీజేపీ నేతలకు మంత్రి పొన్నం చాలెంజ్
జనగణనలో బీసీ ఆప్షన్ లేకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో తెలంగాణపై వివక్షపై క్లాక్ టవర్ వద్ద చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం చేపట్టిన జగనణన, కులగణనలో లొసుగులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. హౌస్ హోల్డ్ సర్వే ఫారంలో ఎస్సీ, ఎస్టీ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని బీసీల ప్రస్తావనే లేదన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై రాష్ట్ర బీజేపీ స్పందించాలన్నారు. బీజేపీ నేతలు ఎంత సేపటికి రాష్ట్రంలో మాకు అధికారం కావాలనే మాట్లాడుతున్నారు. కానీ ఈ 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. మోడీ హయాంలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల విషయంలో సికింద్రాబాద్ క్లాక్ టవరైనా మరెక్కడైనా చర్చకు తాను సిద్ధం అని తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధం అని సవాల్ విసిరారు.
బంగారం కొనొద్దని చెప్పడానికి వచ్చారా?:
బీజేపీ తెలంగాణ ఏర్పాటును అవమానిస్తోందని మండిపడ్డారు. ఏపీకి ఎన్ని డబ్బులు అడిగితే అన్ని ఇస్తూ తెలంగాణకు ప్రత్యేకంగా ఎన్ని నిధులు తెచ్చారని నిలదీశారు. నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులమంతా కేంద్ర మంత్రులను అనేక సార్లు కలుస్తున్నా నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే మా తెలంగాణకు ఫలానా నిధులు, ప్రాజెక్టు కావాలి అంటూ తెలంగాణ బీజేపీ నేతలు కనీసం ఒక్క వినతిపత్రమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మోడీ ఏమిస్తారో చెప్పకుండా బంగారం కొనవద్దు అని సలహాలు ఇచ్చి వెళ్లడానికి తెలంగాణకు వచ్చి వెళ్లారా అని విమర్శించారు. శ్రీరాముడి మేము కూడా పూజిస్తామని, కానీ బీజేపీ మాదిరిగా ఓట్ల కోసం రాముడిని వాడుకోమన్నారు.






