Srikanth Kidambi : మా పెళ్ళికి రండి..సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందించిన పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ దంపతులు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-10-29 07:11:39  IST  )

Srikanth Kidambi : మా పెళ్ళికి రండి..సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందించిన పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్(A famous badminton player), శ్రావ్య వర్మ దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్న శ్రీకాంత్, శ్రావ్యలు తమ వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ శుఖలేఖ(Wedding greetings)ను అందజేశారు. బ్యాడ్మింటన్ ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబికి 2018లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. 2015లో అర్జున అవార్డు సైతం దక్కింది. శ్రావ్య వర్మ టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్. ఆమె నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. పెళ్ళికి సంబంధించిన పలు పనులను శ్రావ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది.

శ్రావ్య వర్మ టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ కూ కూడా ఆమే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి జంటగా గుడ్ లక్ సఖి అనే సినిమాకు నిర్మాతగాను శ్రావ్య వర్మ వ్యవహరించింది.

Next Story