- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. దక్షిణాఫ్రికా బృందానికి సీఎం రేవంత్ పిలుపు
సీఎం రేవంత్ రెడ్డితో సౌత్ ఆఫ్రికా వైస్ ప్రెసిడెంట్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ-దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు పక్షాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, సీఎస్ రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






