- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ఆరు గ్యారంటీపై చర్చకు రా..! సీఎంకు కిషన్‌రెడ్డి సవాల్
Come for a discussion on Revanth's six-point guarantee.. Kishan Reddy challenges the CM

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈనెల 11లోగా సీబీఐతో కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao)ను అరెస్ట్ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాలు విసిరిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే వాళ్లిద్దరినీ 48 గంటల్లో జైల్లో వేస్తామన్న కిషన్‌రెడ్డి కేసు సీబీఐకి ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయడం లేదని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందు రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చకు రావాలన్నారు. బీజేపీ పార్టీ కాళేశ్వరం (Kaleshwaram) విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని కామెంట్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై డిబేట్‌కు రావాలన్నారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని ప్రజలకు వారు ఏం చేస్తున్నారో హితవు పలికారు






