అక్రమ నిర్మాణాలపై కొరడా.. హైడ్రాకు జై కొడుతున్న కాలనీవాసులు

by Ramesh Goud |

హైదరాబాద్ (Hyderabad)లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ కట్టడాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా (Hydraa) అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది.

అక్రమ నిర్మాణాలపై కొరడా.. హైడ్రాకు జై కొడుతున్న కాలనీవాసులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ కట్టడాల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా (Hydraa) అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే వనస్థలిపురం (Vanasthali Puram) పరిధిలోని ఇంజాపూర్ (Injapur)లో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానిక వ్యక్తులు కొందరు ప్రతీ సోమవారం జరిగే హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani)కి ఫిర్యాదు (Complaint) చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా.. శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై స్థానికంగా ఉండే కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

హైడ్రా జిందాబాద్ (Hydra Zindabad).. కమిషనర్ రంగనాథ్ జిందాబాద్ (Commissioner Zindabad) అంటూ.. జైజైలు కొట్టారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు నిర్మించిన ఈ రోడ్డు పలు కాలనీలను వెళ్లే ప్రధాన రహదారి అని కాలనీవాసులు తెలిపారు. ఈ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇంజాపూర్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ఈ నిర్మాణాలు చేపట్టిన తర్వాత అంబులెన్స్ రాక ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కూడా జరిగిందని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమాని తమను బెదిరింపులకు గురి చేశాడని వాపోయారు. ఫిర్యాదుకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసింనందుకు కాలనీ వాసులు హైడ్రాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Next Story