‘మాకు అదే పెద్ద మేలు’.. హైడ్రాకు థాంక్స్‌

by Gantepaka Srikanth |

అప్ప‌టి రోజులు గుర్తుకు వ‌స్తుంటే భ‌య‌మేస్తోంది. ఆ భ‌యాన్నిపారదోలి..

‘మాకు అదే పెద్ద మేలు’.. హైడ్రాకు థాంక్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: అప్ప‌టి రోజులు గుర్తుకు వ‌స్తుంటే భ‌య‌మేస్తోంది. ఆ భ‌యాన్నిపారదోలి.. మా ప్లాట్లు మాకు వ‌చ్చేలా చేసిన హైడ్రా(Hydraa)కు పోచారం మున్సిపాలిటీలోని దివ్యాన‌గ‌ర్ లేఔట్‌లోని 2218 మంది ప్లాట్ య‌జ‌మానులు ధ‌న్య‌వాదాలు చెప్పారు. హైడ్రాకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా స‌రిపోదు. అందుకే నేడు కూడా ర్యాలీ నిర్వ‌హించి ధ‌న్య‌వాదాలు చెబుతున్నామ‌ని.. గురువారం ర్యాలీ నిర్వ‌హించిన సంద‌ర్భంగా తెలిపారు. వాస్త‌వానికి ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌, పార్కుల దురాక్ర‌మ‌ణ‌ను హైడ్రా తొల‌గించింది. కాని మాక‌దే పెద్ద మేలు అయ్యింది. అడ్డుగోడ‌లు తొల‌గ‌డంతో మా ప్లాట్లకు మేము వెళ్ల‌డానికి వీలు కుదిరిందంటూ నాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేశారు. హైడ్రా గాని రంగంలోకి దిగ‌క‌పోతే.. ర‌హ‌దారులు, పార్కులు మాయ‌మై.. త‌మ ప్లాట్లు ఎక్క‌డ ఉన్నాయో గుర్తించ‌లేని ప‌రిస్థితి అంటూ హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల 25వ తేదీన దాదాపు 200 ఎక‌రాల్లో 2218 ప్లాట్లుగా విస్త‌రించిన దివ్య లేఔట్ చుట్టూ 4 కిలోమీట‌ర్ల మేర నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది. అప్పుడు సంబ‌రాలు చేసుకున్నాం. ప్ర‌హ‌రీ నిర్మించి త‌మ ప్లాట్ల‌లోకి వెళ్ల‌కుండా న‌ల్ల‌మ‌ల్లారెడ్డి ఆంక్ష‌లు విధించ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో హైడ్రాను ఆశ్ర‌యించామ‌ని అప్ప‌టి రోజులు గుర్తు చేసుకున్నారు. న‌ల్ల‌మ‌ల్లారెడ్డి కోట‌గోడ‌లు, అడ్డు గోడ‌లు బ‌ద్ధ‌లు కొట్టి 2218 మంది ప్లాట్ల‌కు విముక్తి క‌ల్పించిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలంటూ మ‌రో సారి ర్యాలీ నిర్వ‌హించి అదే లే ఔట్‌లో స‌మావేశమ‌య్యారు ప్లాట్ య‌జ‌మానులు. హైడ్రాకు మ‌రోసారి ధ‌న్య‌వాదాలంటూ నిన‌దించారు.

గోడ కూలింది.. కాల‌నీల‌కు దారి దొరికింది..

4 కిలోమీట‌ర్ల మేర ఉన్న భారీ ప్ర‌హ‌రీని కూల్చి వేయ‌డంతో.. ఏక‌శిలా లే ఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, సుప్ర‌భాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాల‌నీ, ప్ర‌తాప్ సింగారం రోడ్డు, సుప్ర‌భాత్ వెంచ‌ర్ -2, 3, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వ‌త‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడ నివాస ప్రాంతాల‌కు దారి దొరికింద‌ని ఆయా ప్రాంతాల నివాసితులు సంతోషం వ్య‌క్తం చేశారు. త‌మ ప్లాట్‌ను తామే చూడాల‌న్నా, వేరే వాళ్ల‌కు చూపాల‌న్నా.. అనుమ‌తి ఉండేది కాదు.. న‌ల్ల‌మ‌ల్లారెడ్డి నిర్దేశించిన స‌మ‌యంలోనే రావాల్సి ఉంటుంద‌ని.. గేటు ద‌గ్గ‌ర ఎంట్రీ పుస్త‌కంలో వివ‌రాల‌న్నీ రాసిన త‌ర్వాత వారికి ఇష్ట‌మైతే వ‌దిలేవారు.. లేదంటే లేదు.. ఏమాత్రం వారిని ప్ర‌శ్నించినా అక్క‌డివారు త‌మ‌ను కొట్టి పంపించేసేవారు అని హైడ్రా రాక ముందు రోజుల‌ను గుర్త చేసుకున్నారు. అలాగే మిర్జాల‌గూడ మున్సిపాలిటీలోని ప‌ర్వ‌తాపురంలో ముస్లిం, క్రిస్టియ‌న్ మ‌త‌స్తుల శ్మ‌శాన‌వాటిక‌ల‌ను కూడా అక్క‌డి వారు క‌బ్జా చేయ‌గా హైడ్రా వ‌చ్చి విడిపించింద‌ని ప‌లువురు స్థానికులు దివ్యాన‌గ‌ర్ లేఔట్‌లోని ప్లాట్ య‌జ‌మానుల‌తో క‌లిసి ధ‌ర్నాలో పాల్గొన్నారు. హైడ్రా ట్వీట్

Next Story