TG: తెలంగాణలో కాలేజీలు బంద్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల(Fee Reimbursement Dues) అంశం కొలిక్కిరావడం లేదు.

TG: తెలంగాణలో కాలేజీలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల(Fee Reimbursement Dues) అంశం కొలిక్కిరావడం లేదు. దీంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమాఖ్య(ఫతి) మరోమారు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వానికి విధించిన డెడ్‌లైన్ ముగిసింది. దీంతో నవంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రయివేటు కాలేజీలు నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించాయి. రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని గతంలో ప్రభుత్వానికి ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ సమ్మెకు సిద్ధమయ్యాయి.

కాగా, గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మొత్తం బకాయిలు రూ.8వేల కోట్ల వరకు ఉండగా అందులో దాదాపు రూ.5,500 కోట్ల బకాయిలు బీఆర్ఎస్ హయాంలోనివే కావడం గమనార్హం. బకాయిల విషయమై ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపాయి. ఈ క్రమంలో రూ.1,200 కోట్లను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రూ.300 కోట్లు మాత్రమే చెల్లించినట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. మిగిలిన రూ.900 కోట్లు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు అందిస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మళ్లీ నిరసన బాట పట్టనున్నాయి.

Next Story