ధాన్యం సేకరణలో కలెక్టర్లదే బాధ్యత : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రాష్ర్టంలో ఎకరాకు 7 క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి 12 క్వింటాలు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

ధాన్యం సేకరణలో కలెక్టర్లదే బాధ్యత : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎకరాకు 7 క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి 12 క్వింటాలు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. వర్షాలతో రంగుమారిన సోయాచిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు తెలిపినట్లు చెప్పారు.

పంటల సేకరణకు ఈ నవంబర్ నెల కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాలు నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు తెలిపారు. పత్తి కొనుగోలులో ఎల్1 ఎల్2 నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Next Story