Breaking News : పలుగు పార పట్టి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కలెక్టర్

by Muthe.Rajitha |

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఫలిస్తున్నాయి.

Breaking News : పలుగు పార పట్టి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఫలిస్తున్నాయి. సివిల్ సర్వెంట్లు ప్రజాక్షేత్రంలో ఉండి, ప్రజల బాగోగులు తెలుసుకోవాలని ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్(Kotthagudem Collector Jithesh V Patil) సీఎం మాటలను అక్షరాల పాటించారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని టేకులపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలి పనులను స్వయంగా వెళ్ళి పరిశీలించారు. పరిశీలించడమే కాదు.. కూలీలతో కలిసి పలుగు పార పట్టి కాసేపు మట్టి తవ్వి పోశారు. అనంతరం కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై వారి నిర్ణయాన్ని తీసుకున్నారు. జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఎండాకాలం వస్తుండటంతో నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story