సమస్య తెలుసుకొని రాత్రి వేళ ఎంట్రీ ఇచ్చిన కలెక్టర్.. రైతులు హ్యాపీ

by Gantepaka Srikanth |

నల్లగొండ(Nalgonda) జిల్లా చండూరు మండలం పుల్లెముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి(Collector Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమస్య తెలుసుకొని రాత్రి వేళ ఎంట్రీ ఇచ్చిన కలెక్టర్.. రైతులు హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ(Nalgonda) జిల్లా చండూరు మండలం పుల్లెముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ త్రిపాఠి(Collector Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చండూరు మండలం పుల్లెములలో లారీలు సకాలంలో రాకపోవడం మూలంగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని సమాచారం అందుకున్న కలెక్టర్.. సోమవారం రాత్రి పుల్లెముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితిని స్థానిక రైతులు, నిర్వాహకులతో అడిగి తెలుసుకున్నారు. లారీలు సకాలంలో రాకపోవడంపై లారీ కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్య లేకుండా లారీలను ఏర్పాటు చేయాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం నుండి ప్రతిరోజు రెండు వాహనాలు ఏర్పాటు చేసి ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే పంపించాలని చెప్పారు. కాగా, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్‌ ఎంట్రీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story