సీరియస్‌గా ‘ఓట్ చోరీ’పై సంతకాల సేకరణ.. రాష్ట్ర నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించిన ‘ఓట్ చోరీ’ (Vote Chori) పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

సీరియస్‌గా ‘ఓట్ చోరీ’పై సంతకాల సేకరణ.. రాష్ట్ర నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించిన ‘ఓట్ చోరీ’ (Vote Chori) పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ‘ఓట్ చోరీ’తోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడోసారి అధికారంలోకి వచ్చారని, తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లను సైతం అలాంటి మోసాలకు పాల్పడే గెలిచిందని ఆరోపించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 సంతకాలు సేకరించి, అక్టోబర్ 15 నాటికి ఏఐసీసీకి పంపాలని ఆదేశించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా కలిసకట్టుగా పోరాటం చేయాలని టీపీపీ చీఫ్ పిలుపునిచ్చారు. దీంతో ‘ఓట్ చోరీ’పై సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ‘ఓట్ చోరీ’ సంతకాల చోరీపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఇవాళ సాయంత్రం జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో వ్యవహరించాల్సి తీరు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇంచార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొనున్నారు.

Next Story