- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల కుల వివరాల సేకరణ.. మరో 45 విభాగాల డేటా పెండింగ్ : బీసీ కమిషన్ కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుల వివరాల సేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుల వివరాల సేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 390 ప్రభుత్వ విభాగాల్లో 345 విభాగాలు ఇప్పటికే వివరాలను సమర్పించగా, మరో 45 విభాగాలు ఇంకా డేటాను అందించాల్సి ఉందని బీసీ కమిషన్ స్పష్టం చేసింది. సోమవారం బీసీ కమిషన్ కార్యాలయంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు డేటా సేకరణ పురోగతిని సమీక్షించారు. వివరాలు సమర్పించని విభాగాలపై దృష్టి సారిస్తూ, వచ్చే 10 రోజుల్లో ఆ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.
అదేవిధంగా, విద్యార్థుల కుల వివరాల సేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీడ్ పథకానికి అర్హులైన వారికి అవసరమైన డీఎన్‌జీ సర్టిఫికెట్ జారీ విధానాలపై కమిషన్ సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వంకు అందించనుంది. కమిషన్ కార్యాలయంలో బీసీ కులాలపై పుస్తకాలు, రీసెర్చ్ మెటీరియల్, వివిధ రిపోర్టులతో లైబ్రరీని బలపరచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక రీసెర్చ్ అసోసియేట్‌ను నియమించేందుకు ఆమోదం తెలిపినట్టు సభ్యులు వెల్లడించారు.






