తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా.. చంద్రబాబు, దేవినేని వీడియోకాల్స్‌తో మోసం

by Naga Rani Yarlagadda |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను మంచి కంటే చెడుకే ఎక్కువగా వాడుతున్నారు.

తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా.. చంద్రబాబు, దేవినేని వీడియోకాల్స్‌తో మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను మంచి కంటే చెడుకే ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా ఏఐ సహాయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమల పేర్లు చెప్పి.. తెలంగాణ టీడీపీ నేతలను సైబర్ నేరగాడు దోచుకున్నాడు. సెప్టెంబర్ 30న ఓ ఆగంతకుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు దేవినేని ఉమా పీఏనంటూ కాల్ చేశాడు. టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని దేవినేని ఉమా సర్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు.

కాసేపటికే దేవినేని ఉమా వడియో కాల్ చేసి మాట్లాడాడు. మూడు ఫోన్ నంబర్లు పెట్టి..వాటికి నగదు పంపాలని సూచించడంతో.. నిజమేనని నమ్మిన నేతలు రూ.35 వేలు పంపారు. ఈనెల 7న మళ్లీ దేవినేని ఉమా పేరుతో వీడియో కాల్ చేసి.. అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి బీ ఫామ్స్ ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన నేతలు రెండ్రోజుల క్రితం సత్తుపల్లి నుంచి విజయవాడకు వెళ్లారు. మొత్తం 18 మంది హోటల్ కు వెళ్లగా.. వారి బిల్లంతా తానే కడతానని చెప్పాడు.

అయితే మరోసారి కాల్ చేసి.. 8 మందికే సీఎంను కలిసేందుకు అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు ఇవ్వాలని అడగ్గా వారికి అనుమానం కలిగింది. వెంటనే దేవినేని ఉమకు ఫోన్ చేయగా.. అసలు విషయం తెలిసింది. తానెవ్వరికీ ఫోన్లు చేయలేదని చెప్పడంతో.. మోసపోయామని గ్రహించిన నేతలు.. బయటికి చెప్తే పరువు పోతుందని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా. ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నట్లు తెలిసిందని దేవినేని ఉమా నేతలకు తెలిపారు.

Next Story