Cold Wave: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో చలి పులి.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలకు అవకాశం.!

by Ramesh Naini |   (  Updated:2025-11-08 14:43:00  IST  )

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది.

Cold Wave: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో చలి పులి.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలకు అవకాశం.!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Cold temperature) పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో అటు ఏపీలో కూడా రాత్రి, తెల్లవారుజామున ప్రజలు చలి పులితో వణికిపోతున్నారు. మొంథా తుఫాన్ వర్ష బీభత్సం తర్వాత మొదలైన చలి తీవ్రత (శనివారం) ఇవాళ్టికి కనిష్ట స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నవంబర్ 8 వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పటాన్ చెరు ఇక్రిశాట్ ప్రాంతంలో ఇవాళ (నవంబర్ 8, శనివారం) 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక బేగంపేటలో 16.9, హయత్‌నగర్ 17, హకీంపేట 17.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ 14.2, మెదక్ 15, నిజామాబాద్ 16.8, మహబూబ్ నగర్ 18.5, రామగుండం 19.6, ఖమ్మం జిల్లాలో 19.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది.

మరోవైపు ఏపీలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. వివరాల కోసం క్లిక్ చేయండి..

Next Story