అలర్ట్.. ఓ వైపు చలి.. మరోవైపు వర్షాలు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

by Ramesh Naini |

రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అలర్ట్.. ఓ వైపు చలి.. మరోవైపు వర్షాలు.. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలోని మధ్య వాయువ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు ఆనుకుని అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కి.మీ విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు:

రాష్ట్రంలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కనిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రాంతం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్ లలో)

ఆదిలాబాద్ 10.7

భద్రాచలం 21.2

హకీంపేట 18

దుండిగల్ 17

హన్మకొండ 15

హైదరాబాద్ 17.8

ఖమ్మం 20

మహబూబ్ నగర్ 20

మెదక్ 14.1

నల్గొండ 17.2

నిజామాబాద్ 15.3

రామగుండం 16.4

పటాన్చెరు 15.4

రాజేంద్రనగర్ 16

హయత్ నగర్ 18.6

Next Story