Kritunga Hotel: రాగిముద్దలో బొద్దింక

by Gantepaka Srikanth |

బయట హోటల్స్‌లో తినాలంటేనే జనాలు వణికిపోయే పరిస్థితులు దాపురించాయి.

Kritunga Hotel: రాగిముద్దలో బొద్దింక
X

దిశ, వెబ్‌డెస్క్: బయట హోటల్స్‌లో తినాలంటేనే జనాలు వణికిపోయే పరిస్థితులు దాపురించాయి. కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యమే హోటల్‌లో భోజనం అంటేనే భయపడేలా చేస్తోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రతను గాలికొదిలేసి నిల్వ ఉంచి బూజు పట్టిన వంటకాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ తరహా ఘటనలు వరుసగా వెలుగుజూశాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోచోట చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని నానక్రామ్‌గూడ కృతింగా హోటల్‌లో ఓ వినియోగదారుడు రాగిముద్ద ఆర్డర్ చేశాడు. అయితే అది తింటుండగా ఒక్కసారిగా రాగిముద్దలో బొద్దింక ప్రత్యక్ష్యం అయింది. దీంతో అవాక్కయిన వినియోగదారుడు హోటల్ నిర్వహకులను నిలదీశాడు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story