- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు గనుల స్కామ్.. బామ్మర్ది కళ్ళల్లో సంతోషం కోసమే! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్
బామ్మర్ది కళ్ళల్లో సంతోషం కోసం సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనులను కట్టబెట్టాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బామ్మర్ది కళ్ళల్లో సంతోషం కోసం సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనులను కట్టబెట్టాలని చూశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలతో సింగరేణి బొగ్గు గనుల స్కామ్ నిజం అని నిరూపితం అయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై భట్టి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారని, తన బామ్మర్దికి తప్పుడు పద్ధతిలో రేవంత్ రెడ్డి టెండర్ ఇచ్చారా.. లేదా? అని ప్రశ్నించారు. విచారణకు మీనమేషాలు ఎందుకు? అని ప్రశ్నించారు. లాల్ బహదూర్ శాస్త్రి లాగా టెండర్లు రద్దు చేశామని భట్టి తాను నిజాయితీపరుడని చెప్పుకొనే ప్రయత్నం చేశారన్నారు. టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారో భట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి టెండర్ల స్కామ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అనుయాయులకు, బామ్మర్దికి ఇచ్చిన టెండర్లు ఎందుకు రద్దు చేయరని నిలదీశారు.
భట్టి ఎవరికి భయపడుతున్నారు..
భట్టి ఎవరికి భయపడుతున్నారని అన్నారు. పేపర్లలో భట్టిపై రాసిన వారి గురించి మాట్లాడారు.. మరి రాయించిన వ్యక్తి ఎవరు? దాని గురించి భట్టి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. భట్టిపై వార్తలు వేసిన దానికి కథ, స్క్రీన్‌ప్లే మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై హరీశ్‌రావు ఆధారాలతో బయటపెట్టారని చెప్పారు. హరీశ్‌రావు మాట్లాడగానే సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. పోలీసు అధికారులతో ప్రకటనలు ఇప్పిస్తున్నారని, మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు వేయిస్తున్నారని ఆరోపించారు. భట్టి 40 ఏళ్ల రాజకీయ జీవితం పట్ల ఎవరికి అభ్యంతరం లేదని, మరి 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను తిట్టవద్దని భట్టి రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కోసం స్కామ్ జరిగిందని భట్టి ఎందుకు చెప్పలేకపోయారన్నారు. సోలార్ స్కామ్‌పై భట్టి స్పష్టత ఇవ్వలేదు.. దోపిడీ కోసమే గద్దెనెక్కారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.






