- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కు కోచింగ్
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యం సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ తరగతులు 2025 జూలై 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది 20226 ఏప్రిల్30వ తేదీ వరకు(టీజీ బీసీస్టడీ సర్కిల్), లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్ లో నిర్వహించబడుతాయని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యం సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ తరగతులు 2025 జూలై 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది 20226 ఏప్రిల్30వ తేదీ వరకు(టీజీ బీసీస్టడీ సర్కిల్), లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్ లో నిర్వహించబడుతాయని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.150 మంది అభ్యర్ధులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, వీరిలో 100 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులను జూన్12వ తేదీన నిర్వహించే ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మరో 50 మంది అభ్యర్థులను, గతంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుంన్నారు. వీరు సంబందిత పత్రాలతో నేరుగా టీబీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మినగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్-500059లో తేదీ 16-06-2025 నుంచి 08-07-2025లోగా దరఖాస్తు సమర్పించిన వారిని ఎంపిక చేయబడుతుందన్నారు.
ప్రవేశం పొందిన అభ్యర్థులకు లాడ్జింగ్ బోర్డింగ్, రవాణా ప్రయోజనం కోసం నెలకు 5వేలు, స్టైఫండ్, 5వేలు, బుక్ ఫండ్ ఒక్కసారి మాత్రమే అందించడం జరుగుతుందన్నారు. గ్రంథాలయ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపికకు సంబంధించి 16-06-2025 నుంచి 08-07-2025 వరకు అర్హులైన అభ్యర్థుల ఆన్ లైన్ లో దరఖాస్తులు www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా అప్ లోడ్ చేయాలన్నారు. వివరాలకు 040-24071178 నంబరును సంప్రదించవచ్చునని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.






