- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయా ట్రెండ్ హాస్టల్స్! నగరంలో పెరుగుతున్న కో లివింగ్ కల్చర్.. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు
చదువు, ఉద్యోగ రీత్యా అనేక మంది యువతీ యువకులు హైదరాబాద్ నగరంలో స్టే చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: చదువు, ఉద్యోగ రీత్యా అనేక మంది యువతీ యువకులు హైదరాబాద్ నగరంలో స్టే చేస్తున్న విషయం తెలిసిందే. అధిక రూమ్ రెంట్స్ కారణం, టైమ్‌కు భోజనం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్టల్స్‌లను ఎంపిక చేసుకుంటారు. నగరంలో సైతం (Boys and Girls Hostels) బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, పీజీలు ఉన్నాయి. నెలకు దాదాపు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు పైగా ప్రైవేటు హాస్టల్ అన్ని సౌకర్యాలతో యాజమన్యం ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే, అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే రూమ్‌లో ఉండే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే ఈ మధ్య హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్ మొదలైనట్లు తెలుస్తోంది.
ఇలాంటి హాస్టల్స్‌ను కోలివింగ్ హాస్టల్స్, కోలివింగ్ (Co-living PG culture) పీజీలు అని పిలుస్తారు. గతంలో ఇలాంటి హాస్టల్స్‌కు ఉన్నా కూడా ఎవరికీ తెలిసేవి కావు. ఇప్పుడు మాత్రం పబ్లిక్‌గానే అడ్వటైజ్‌లు చేసుకుంటున్నారు. ఇలాంటి హాస్టల్స్‌లో సీసీ కెమరాల నిఘా, ప్రీమియమ్, లగ్జరీ హోటల్స్ దొరికే సౌకర్యాలు ఈ పీజీల యాజమాన్యం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ హాస్టల్ వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇలాంటి పీజీలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పీజీలకు స్టాటింగ్ ఫీజు సౌకర్యాలను భట్టి రూ.10 నుంచి రూ.15000 వేలకు వసూలు చేస్తున్నారు. ఇక, నగరంలో కో లివింగ్ కల్చర్ పెరుగుతుంది. యువత కూడా రెగ్యులర్ హాస్టల్స్ కంటే ఇలాంటి పీజీలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కో లివింగ్ పీజీలు నగరంలో పుట్టుకొస్తున్నాయి. అయితే లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారికి ఇలాంటి పీజీలు బాగా కలిసి వస్తాయని నెటిజన్లు అంటున్నారు. కానీ ఏదైనా జరిగితే ఇద్దరికీ ప్రమాదమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






