- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ప్రకటన చేయకపోవటం దుర్మార్గం.. మిలియన్ మార్చ్ ను తలపించేలా జులై 2 భూ పోరాటం: కవిత
జులై 2న ఉప్పల్ భగాయత్‌లో మిలియన్ మార్చ్ తరహాలో భూపోరాటం చేస్తామని, ఆగస్ట్ 6లోగా ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేస్తారని భావించామని కానీ ఆ అంశాన్ని ఆయన మాట్లాడకపోవగా కేకే కమిటీ విధివిధానాలను కూడా చెప్పకపోవటం దుర్మార్గం, శోచనీయం అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున భూ పోరాటం చేస్తామని నిన్న చెప్పినట్లుగానే వచ్చే జులై 2న ఉప్పల్ భగాయత్‍లో అతి పెద్ద భూపోరాటం చేయబోతున్నామని ఇవాళ ప్రకటించారు. మరొ మిలియన్ మార్చ్ ను తలపించేలా ఈ ఉద్యమాన్ని చేద్దామని, ఈ కార్యక్రమానికి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కవిత పాల్గొని జాతీయ జెండా ఆష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, న్యాయవాదులు, పత్రిక మిత్రులు సహా ఊరికి ఒక్కరైనా సద్ది కట్టుకోనిని ఆ పోరాటానికి రావాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను ఆదుకోని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మేము అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని, ఉద్యమకారులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు.
ఆగస్టు 6 లోగా ఏర్పాటు చేయాలి:
ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచిచారని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం అన్యాయం అని తెలంగాణ జాగృతి తరఫున నాలుగు జిల్లాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకున్నామన్నారు. కానీ హైదరాబాద్‍లోనూ ఆయన విగ్రహాం ఉండాల్సిన అవసరముందన్నారు. అందుకే ఆయన విగ్రహం పెట్టాలని నిన్న ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. జయశంకర్ సార్ విగ్రహం కోసం 2017లో అప్పటి మున్సిపల్ శాఖకు కూడా లేఖ రాశామని కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆగస్టు 6న జయశంకర్ సార్ జయంతి ఉందని ఆ లోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖకు మేము ఇచ్చిన లేఖను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
మాకు అవకాశం ఇవ్వండి లేదా మీరైనా చేయండి:
మాకు అవకాశం ఇస్తే జయశంకర్ సార్ విగ్రహా (Professor Jayashankar Statue) ఏర్పాటు ఖర్చుతో పాటు లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ మేమే చూసుకుంటామని కవిత చెప్పారు. లేదంటే ప్రభుత్వమే అంతకన్నా గొప్పగా చేస్తామంటే కూడా చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అనేది మరో స్వాతంత్య్ర పోరాటం మాదిరిగా జరిగిందని, ఇప్పుడున్న పిల్లలకు ఈ ఉద్యమం గురించి పూర్తిగా తెలియదన్నారు. వారంతా మన చరిత్రను తెలుసుకోవాలని, ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారన్నారు. జూన్ 2 అంటే ఒక హాలిడే కాదని మీకు వివక్ష లేకుండా, మీ యాసను మీరు మాట్లాడుకునేలా చేసిన రోజు అని గుర్తు చేశారు. మీరు సెకండ్ గ్రేడ్ పౌరులు కాదని, ఎంతో స్వేచ్ఛగా ఉండే అవకాశం వచ్చిన రోజు అని అందుకే మన చరిత్రను కచ్చితంగా ఇప్పటి పిల్లలంతా కూడా తెలుసుకోవాలన్నారు. ఆగస్టు 15 న ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకుంటామో.. జూన్ 2ను కూడా అంతే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.






