CM Revanth Reddy: కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయిన సీఎం హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |   (  Updated:2025-08-28 13:41:49  IST  )

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.

CM Revanth Reddy: కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయిన సీఎం హెలికాప్టర్.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Heavy rains) రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కామారెడ్డిలో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం బృందం ఉన్న (helicopter) హెలికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది. దీంతో (Medak) మెదక్ చేరుకుని వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు సమీక్షలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ రఘునందన్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను, వరద పరిస్థితులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

Next Story