- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూ దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలు.. పీసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు పిలుపు మేరకు ఇవాళ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం, మహిళా మోర్చా కార్యకర్తలు పీసీసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఉద్రిక్తతల వాతావరణం నడుమ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకు దిగిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని పార్టీ ఆరోపించింది. శాంతియుత నిరసనను క్రూరంగా అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి పరాకాష్ట అని, హిందూ సమాజాన్ని అవమానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ట్వీట్






