- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆనందంగా పరిహారం తీసుకోండి.. ఫ్యూచర్ సిటీ రైతులపై సీఎం కీలక వ్యాఖ్యలు
ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరించాలని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భూములిచ్చే రైతులకు తగిన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్యూచర్ సిటీ కోసం స్థానిక రైతులు భూములు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీకి భూమి ఇచ్చిన రైతులను ఆదుకుంటామని రైతులు ఆనందంగా పరిహారం తీసుకోవాలన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేట్‍లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించిన సీఎం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడి రైతుల్లో అభద్రతా భావం లేకుండా అధికారులు భూసేకరణ చేపట్టాలని అభివృద్ధి కోసం భూములిచ్చే రైతుల్ని అధికారులు గౌరవించాలని సూచించారు. పేద రైతుల విషయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని ఈ రెండేళ్లు రైతులు సహకరిస్తే అద్భుతంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. ఇక్కడ భూములిచ్చిన రైతులు, మరోచోట భూమిని కొనేలా డబ్బులు ఇస్తామన్నారు.
ప్రజాప్రతినిధులు భాగస్వాములు కండి:
ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. సర్పంచ్‍లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఫ్యూచర్ సిటీ పరిధి గ్రామాల సర్పంచ్‍ల వివరాలు తెప్పించుకోవాలని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగితే వారికి పాస్ పంపించాలన్నారు. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. అలాంటి గ్రామాలు గ్రామసభలు పెట్టి తీర్మానలు చేసి కలెక్టర్, మంత్రికి పంపించాలన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని అందరూ కలిసి పని చేస్తేనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల నగరం అన్నారు.






