- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నిన్న బాధ్యతల స్వీకరణ.. నేడు క్షేత్రస్థాయి పర్యటన
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే జితేష్ వీ పాటిల్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే జితేష్ వీ పాటిల్(CMD Jitesh V. Patil) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ‘కరెంటోళ్ల ప్రజాబాట’లో భాగంగా బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్ సెక్షన్‌లో శనివారం విద్యుత్ నెట్ వర్క్‌ను పరిశీలించి అక్కడి అధికారులు, సిబ్బందితో కలియ తిరిగారు. స్థానికులతో కలిసి వారితో ముచ్చటించారు. విద్యుత్ సంబంధిత సమస్యలపై ఆరా తీశారు. అనంతరం మోతీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ (డీటీఆర్)ను ఆయన ప్రారంభించారు.
ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ ముందస్తు సూచనల నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా పని చేస్తున్న తమ సంస్థ అధికారులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేపట్టారన్నారు. ఈ పర్యటనలో సంస్థ డైరెక్టర్ డా. నరసింహులు, వీ.శివాజీ, బంజారా హిల్స్ సూపెరింటెండింగ్ ఇంజినీర్ నరసింహులు ఇతర అధికారులు పాల్గొన్నారు.






