రేపు సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-17 17:07:20  IST  )

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్​ ఎదురుగా సర్దార్​ సర్వాయి పాపన్న

రేపు సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్​ ఎదురుగా సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహానికి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ఇతర మంత్రులు విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి డిమాండ్​ ఉన్నా... బీఆర్​ఎస్​ హయాంలో నిర్లక్ష్యం వహించడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.

దీంతో ఆయన విగ్రహం ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్​ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​, మంత్రి పొన్నం ప్రభాకర్​, సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆర్​వీ కర్ణన్​, హైదరాబాద్​ జిల్లా కలెక్టర్​ దాసరి హరిచందన, హెచ్​ఎండీఏ కమిషన్​ సర్ఫరాజ్​ అహ్మద్​లు పరిశీలించారు. సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన అనంతరం రవీంద్ర భారతిలో జరిగే పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో రేవంత్​ రెడ్డి పాల్గొంటారు.

Next Story