కర్నాటకకు రా.. కేసీఆర్ వ్యాఖ్యలకు CM సిద్ధరామయ్య స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 9 |
కర్నాటకకు రా.. కేసీఆర్ వ్యాఖ్యలకు CM సిద్ధరామయ్య స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణలపై కర్నాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయో లేవో కేసీఆర్ వచ్చి చూడాలని, ఏం వివరాలు కావాలో చెప్పు.. నేనే పక్కన ఉండి చూపిస్తా. ఏయే గ్యారంటీకి ఎంత నిధులు ఇచ్చి అమలు చేస్తున్నామో, ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తున్నదో వివరిస్తానని అన్నారు. ఎన్నికల్లో అవినీతి డబ్బుతో అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ ను ఓడించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈనెల 30వ తేదీ కోసం ప్రజలు ఆతృతంగా ఎదురు చూస్తున్నారని ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు.

Next Story

Most Viewed