సీఎం గారు విచారణకు ఆదేశించండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-16 08:29:23  IST  )

మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో నేతలను డిఫెన్స్ పడేసింది.

సీఎం గారు విచారణకు ఆదేశించండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో నేతలను డిఫెన్స్‌లో పడేసింది. అయితే, తాజగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వమంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కామెంట్ చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ’ఆపరేషన్ సిందూర్’‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. పాక్ దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Next Story