- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : సీఎం రేవంత్ మాటల్లోనే ప్రజాపాలన : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddy' చెప్పిన ప్రజాపాలన(Public Governance) మాటలకే పరిమితమైంద(Limited To Words)ని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(T. Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని సెటైర్లు వేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddy' చెప్పిన ప్రజాపాలన(Public Governance) మాటలకే పరిమితమైంద(Limited To Words)ని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(T. Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని సెటైర్లు వేశారు. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు..పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలు..ప్రజా పాలన అంటివి..సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి..ఏడాది కాలంగా ముఖం చాటేస్తివని దుయ్యబట్టారు.
సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా..దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావని విమర్శించారు. తెలంగాణ సీఎం అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావని.. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నావని..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని హరీష్ రావు ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో..తదుపరి సీఎంగా పదవీ ప్రమాణాస్వీకారం వేళ ప్రగతి భవన్ గడీల పాలన బద్ధలు కొట్టి ప్రజాపాలన సాగిస్తామని..కేసీఆర్ మాదిరిగా సీఎం ప్రజలను కలవకుండా అధికార నివాసానికే పరిమితమవ్వకుండా ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని..ప్రజా భవన్ లో ప్రజలను తరుచు కలుస్తానని చెప్పిన మాటలను హరీష్ రావు తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు..ఆచరణలో జరుగుతున్న పాలనకు పొంతన లేదని హరీష్ రావు మండిపడ్డారు. హరీష్ రావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎన్నికల హామీల దాటవేత..రైతు రుణమాఫీ లెక్కలపైన, రైతు భరోసా, విదేశీ పెట్టబడులు సహా ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలు..ప్రభుత్వ వైఫల్యాలపై తరుచు ప్రశ్నాస్త్రాలు సంధిస్తునే ఉన్నారు.






