దావోస్‌లో ముగిసిన CM రేవంత్ బృందం పర్యటన

by Gantepaka Srikanth |
దావోస్‌లో ముగిసిన CM రేవంత్ బృందం పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం దావోస్(Davos) పర్యటన ముగిసింది. రేపు ఉదయం శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), అధికారులు ఉన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్, దావోస్‌లో పర్యటించారు. కాగా, దావోస్ పర్యటనలో తెలంగాణ తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు సాధించింది. వివిధ కంపెనీలతో ఇప్పటివరకు రూ.1.64 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నది.

గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులు రావటం విశేషం. దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి.



Next Story