జూబ్లీహిల్స్‌లో CM రేవంత్ ఆకస్మిక పర్యటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-24 11:08:59  IST  )

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పర్యటించారు.

జూబ్లీహిల్స్‌లో CM రేవంత్ ఆకస్మిక పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు(GHMC Park) పనులను పరిశీలించారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగివస్తున్న సందర్భంలో పార్కు వద్ద ఆగి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని గతంలో జీహెచ్ఎంసీని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్కులో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్క్‌లో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Next Story