CM Revanth: అడవిలో మృగాలను చూశా.. మీరెంత?

by Gantepaka Srikanth |

‘నేను.. పాలమూరు జిల్లా నల్లమల కొండారెడ్డిపల్లిలో పుట్టిన బిడ్డను.. పుల్లలను చూసిన.. మృగాలను చూసిన.. తోడేళ్లను చూసిన.. మానవ మృగాలు మీరెంత..!? నా కాలి గోటికి కూడా సరిపోరు’ అంటూ విపక్షాలపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CM Revanth: అడవిలో మృగాలను చూశా.. మీరెంత?
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ‘నేను.. పాలమూరు జిల్లా నల్లమల కొండారెడ్డిపల్లిలో పుట్టిన బిడ్డను.. పుల్లలను చూసిన.. మృగాలను చూసిన.. తోడేళ్లను చూసిన.. మానవ మృగాలు మీరెంత..!? నా కాలి గోటికి కూడా సరిపోరు’ అంటూ విపక్షాలపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ గ్రామ పరిధిలో నిర్వహించిన ‘రైతు పండుగ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి విషయమలో బీఆర్ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను.. దేనికీ లొంగేవాడిని కాదు.. తొక్కుకుంటూ ఇందాక వచ్చాను.. పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకుంటానా’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘70 ఏళ్ల తర్వాత ఈ ప్రాంత బిడ్డనైన నాకు ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం లభించింది. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసుకొని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తా’ అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో అగ్గి పెట్టే రావు (హరీష్ రావు) మాటలు విని కొంతమంది రెచ్చిపోయి అధికారులపై దాడులకు పాల్పడ్డారు అని చెప్పారు. ఇప్పుడు కొంతమంది వచ్చి కేసులు తీసివేయమంటున్నారు.. నాపైనే 182 కేసులు ఉన్నాయి.. కేసులు వేరు.. ముఖ్యమంత్రి సీటు వేరు అని ఆయన వెల్లడించారు.. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఉచ్చులో పడకండి.. ఈ జిల్లా బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Next Story