- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెండో రోజు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ (Delhi) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ (Delhi) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ (AICC) కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఆవశ్యకతను తెలుపుతూ.. కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజికవర్గాల వారీగా వివరాలపై క్షుణ్ణంగా వివరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లులను లోక్‌సభతో పాటు రాజ్యసభలో ఆమోదించి రాజ్యాగంలోని షెడ్యూల్-9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను సీఎం రేవంత్ కోరనున్నారు.






