కాసేపట్లో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-16 05:14:15  IST  )

ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవసాయ శాఖ (Department of Agriculture)పై సమీక్ష నిర్వహించనున్నారు.

కాసేపట్లో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవసాయ శాఖ (Department of Agriculture)పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు భరోసా (Raitu Bharosa), వ్యవసాయ సంబంధిత పథకాల అమలుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. వానాకాలం సీజన్‌లో రైతు భరోసా అమలుతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa)పై వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు.

మరోవైపు రైతు బీమా ప్రీమియం చెల్లింపు, పంటల బీమా పథకం విధివిధానాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న కోహెడ్ మార్కెట్ యార్డు (Koheda Market Yard)కు అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా.. ఆ అంశంపై సీఎం చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ యాక్షన్ ప్లాన్‌పై డిస్కస్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల మెర్జ్, వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లను విలీనం చేయడంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

Next Story