- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికలపై నేడు CM రేవంత్ సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకునే చాన్స్!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లోకల్ ఎలక్షన్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో (పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు) నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై హైకోర్టును మరింత గడువును కోరే అంశంపై డిస్కస్ చేయనున్నారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పార్టీల పరంగా నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించనున్నారు. జిల్లా అధికారులకు శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం లాంటి అంశాలపై సీఎం రేవంత్ ఈ సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది.






